Hyderabad, ఏప్రిల్ 25 -- జీవితం అనేది ఎప్పుడూ ఒకేలా జరిగే సాఫీ ప్రయాణం కాదు. ఒక్కోరోజూ ఒకలా ఉంటుంది. ప్రతి మనిషి జీవితంలో ఒక దశ వస్తుంది. ఈ దశలో ఆత్మవిశ్వాసం పూర్తిగా సన్నగిల్లిపోతుంది, సమస్యలన్నీ చుట్టుముట్టి నేలలో కూరుకుపోతున్నట్లు అనిపిస్తుంది. అలాంటి సందర్భంలో చాలా మంది ఇంత కష్టం ఎందుకొచ్చింది, ఎందుకు నాకే ఎప్పుడూ కష్టాలు వస్తుంటాయి అని ఫీలవుతుంటారు, వీటిని ఎన్నాళ్లు ఎదుర్కోవాలని బాధపడుతుంటారు.కొందరు జీవితం మీద ఆశలు కోల్పోయి నిరాశలోనే జీవిస్తారు.

సరిగ్గా ఇలాంటి ఆలోచనలతోనే ఓ కూతురు నాన్న దగ్గరకు వెళుతుంది. జీవితంలో తాను ఎన్నో ఒత్తిళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందనీ, బతుకు భారంగా మారిందని, తట్టుకోవడం కష్టంగా ఉందనీ బాధపుడుతూ ఉంటుంది. అప్పుడు ఆ నాన్న కూతురికి ఏం చెబుతాడో తెలిస్తే మీరు కూడా మీ ఆలోచనను మార్చుకుంటారు. కష్టాలను చూసి ఎప్పుడూ భయపడర...