భారతదేశం, మే 6 -- పహల్గామ్ ఉగ్రదాడికి మూడు రోజుల ముందు ప్రధాని కార్యాలయానికి ఇంటెలిజెన్స్ రిపోర్టు వచ్చిందని, అందువల్లనే ప్రధాని నరేంద్ర మోదీ గత నెలలో తన జమ్మూకశ్మీర్ పర్యటనను రద్దు చేసుకున్నారని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇంటెలిజెన్స్ వైఫల్యం వల్లే ఈ దాడి జరిగిందని బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కూడా అంగీకరించిందని ఖర్గే అన్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున్ ఖర్గే మంగళవారం జార్ఖండ్ లో జరిగిన ర్యాలీలో పాల్గొన్న సందర్భంగా ఈ ఆరోపణలు చేశారు.

పహల్గామ్ ఉగ్రదాడిని నివారించడంలో ఇంటెలిజెన్స్ వైఫల్యం ఉందని ప్రభుత్వం కూడా అంగీకరించిందని ఖర్గే అన్నారు. ''నిఘా విభాగం నుంచి సమాచారం ఉంటే ఎందుకు భద్రతను కట్టుదిట్టం చేయలేదు? దాడి జరగడానికి మూడు రోజుల ముందు ప్రధాని మోదీకి ఇంటెలిజెన్స్ రిపోర్టు పంపారని, అందుకే ఆయన కశ్మీర్ పర...