భారతదేశం, మార్చి 6 -- విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కశ్మీర్‌పై అడిగిన ప్రశ్నలకు చమత్కారంగా స్పందించారు. అమెరికా, బ్రిటన్ సహా పలు దేశాల పర్యటనల్లో జర్నలిస్టులకు కచ్చితమైన సమాధానాలు ఇస్తున్నారు. బ్రిటన్ చేరుకోగానే చాట్ హోమ్ హౌస్ లో జరిగిన థింక్ ట్యాంక్ కార్యక్రమంలో కశ్మీర్ అంశంపై ఓ పాకిస్థానీ జర్నలిస్ట్‌కు సమాధానం ఇచ్చారు. జైశంకర్ ఇచ్చిన సమాధానం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

కశ్మీర్ సమస్య పరిష్కారం కావడం లేదని నిసార్ అనే పాక్ జర్నలిస్ట్ ప్రశ్నించారు. కశ్మీర్‌ను భారత్ అక్రమంగా ఆక్రమించుకుంది. ప్రధాని నరేంద్ర మోదీతో డోనాల్డ్ ట్రంప్‌కు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను ఉపయోగించడం ద్వారా ప్రధాని నరేంద్ర మోదీ కాశ్మీర్ సమస్యను పరిష్కరించగలరా? అని అడిగారు.

ఇలా పాకిస్థాన్ జర్నలిస్ట్ చాలా ప్రశ్నలు వేశారు. తర్వాత ఎస్ జైశంకర్ సమాధానం ఇవ్వడం ప...