భారతదేశం, ఏప్రిల్ 22 -- జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లో జరిగిన ఉగ్రదాడిలో 12 మంది పర్యాటకులు గాయపడ్డారు. వారిలో ఒకరు చనిపోయారని, మరో నలుగురి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. జమ్ముకశ్మీర్ లోని పహల్గామ్ లోని బైసరన్ లోయలో కాల్పుల శబ్దం వినిపించడంతో భద్రతా బలగాలు అక్కడికి చేరుకున్నాయి. పర్యాటకులు ఎక్కువగా సందర్శించే ప్రదేశాల్లో ఉగ్రదాడులు జరిగే అవకాశం ఉందని ఇప్పటికే ఇంటలిజెన్స్ ప్రాథమిక నివేదికలు హెచ్చరించాయి. కాల్పుల ఘటన అనంతరం ఈ ప్రాంతానికి అదనపు భద్రతా బలగాలను రప్పించి గాలింపు చర్యలు చేపట్టారు.

గుర్తుతెలియని దుండగులు పర్యాటకులపై అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిపారని, దీంతో పలువురికి గాయాలయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈ దాడిలో తన భర్త తలపై కాల్పులు జరిగాయని, మరో ఏడుగురికి గాయాలయ్యాయని ఒక బాధితురాలు ఫోన్ ద్వారా పీటీఐకి త...