భారతదేశం, డిసెంబర్ 7 -- మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ టైగర్ రిజర్వ్ నుండి భీమ్‌పూర్, బోథ్, కడెం నది ప్రాంతాల అడవుల గుండా కవ్వాల్‌‌‌ టైగర్ రిజర్వ్ వరకు మరో టైగర్ కారిడార్‌ను అభివృద్ధి చేయాలని అటవీ శాఖ ప్లాన్ చేస్తోంది. నవంబర్ నుండి జనవరి వరకు పులుల సంభోగం సమయంలో ఆదిలాబాద్‌కు వలస వచ్చే పులులకు సురక్షితమైన మార్గాన్ని అందించడం, తద్వారా అవి కవ్వాల్‌‌‌ టైగర్ రిజర్వ్‌లోకి ప్రవేశించి చివరికి అక్కడ నివాసం ఉండేందుకు ఈ కారిడార్‌ను రూపొందించడం లక్ష్యంగా పెట్టుకుంది అటవీశాఖ.

ఆదిలాబాద్ జిల్లాలోని భీమ్‌పూర్ మండలం గొల్లఘాట్-తంసి ప్రాంతంలో ప్రస్తుతం సంచరిస్తున్న రెండు పులులకు ఎటువంటి హాని జరగకుండా చూసుకోవడానికి స్థానిక రైతులలో అవగాహన కల్పిస్తున్నారు అటవీశాఖ అధికారులు. రెండు అటవీ ప్రాంతాల మధ్య పలు ప్రాంతాలను కలపడం ద్వారా పులులు కవాల్‌లోకి ప్రవేశించడానికి అంత...