భారతదేశం, జనవరి 7 -- శాసనమండలి సభ్యత్వానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఇచ్చిన రాజీనామాను శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఆమోదించారు. 2021లో నిజామాబాద్‌ స్థానిక సంస్థల స్థానం నుంచి శాసనమండలికి ఎన్నికైన కవిత. బీఆర్‌ఎస్‌ పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి సెప్టెంబర్‌ 3న రాజీనామా చేశారు. అప్పట్నుంచి ఆమె రాజీనామా లేఖ పెండింగ్ లోనే ఉంది. పలుమార్లు మండలి ఛైర్మన్ ను కూడా కవిత కలిశారు. తన రాజీనామాను ఆమోదించాలని విజ్ఞప్తి చేశారు.

తాజాగా జరిగిన శాసనమండలి సమావేశాలకు కవిత హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె. తన రాజకీయ ప్రస్థానాన్ని చెప్పే ప్రయత్నం చేశారు. తెలంగాణ ఉద్యమంతో పాటు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని ఇబ్బందులను ఎదుర్కొన్నట్లు వివరించారు. ఈ క్రమంలోనే తాను ఇచ్చిన రాజీనామాను వెంటనే ఆమోదించాలని మండలి ఛైర్మన్ కు ప్రత్యేకంగా విజ్ఞప్తి ...