భారతదేశం, జనవరి 13 -- సంక్రాంతి పండుగ దగ్గరకొచ్చింది. కానీ ఓ ఊర్లో ఈ సమయంలో విషాదం నెలకొన్నది. కాకినాడ జిల్లా రౌతులపూడి మండలంలోని సార్లంకపల్లె గిరిజన తండాలో సోమవారం రాత్రి ఘోరమైన అగ్నిప్రమాదం జరిగింది. మన్యంలో ఉన్న ఈ తండాలో 38 పూరిళ్లు అగ్నికి ఆహుతయ్యాయి. కేవలం మూడు పక్కా ఇళ్లు మాత్రమే మిగిలాయి. దాదాపు ఊరు ఊరంతా కాలి బూడిదైన పరిస్థితి.

ఈ ఘోరమైన ప్రమాదంలో సుమారు 120 మంది గిరిజనులు కట్టుబట్టలతో రోడ్డు మీదకు వచ్చారు. తమకు చెందిన వస్తువులన్నీ కళ్ల ముందే కాలి బూడిదైపోయాయి. గిరిజనులు బిక్కుబిక్కుమంటూ చూశారు. సరకులు కొనుగోలు చేసేందుకు కొందరు గ్రామస్థులు తుని పట్టణానికి వెళ్లారు. మరికొందరు ఊర్లోనే ఉన్నారు. తుని నుంచి వచ్చేసరికి ఊరు ఊరంతా కాలిపోయింది. అక్కడే ఉన్న గ్రామస్థులు ప్రాణాలు కాపాడుకోవడానికి పరుగులు పెట్టడం తప్ప.. ఏం చేయలేని పరిస్థితి నెల...