భారతదేశం, మే 20 -- హౌస్ ఆఫ్ కళ్యాణ్ నుండి లైఫ్ స్టైల్ జ్యువెలరీ బ్రాండ్ అయిన కాండెరే, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ను బ్రాండ్ అంబాసిడర్ గా నియమించింది. ఇది దాని జాతీయ విస్తరణ వ్యూహంలో కీలకమైన అడుగుగా భావిస్తున్నారు. కొత్త కస్టమర్ వర్గం కోసం ఆభరణాలను పునర్నిర్వచించడంతో పాటు, రోజువారీ స్వీయ వ్యక్తీకరణకు కాండెరే ఆభరణాలను రూపొందించినట్లు కళ్యాణ్ జ్యువెలర్స్ తెలిపింది. తన ప్రపంచ స్థాయి ఆకర్షణతో షారుఖ్ ఖాన్ కాండెరే బ్రాండ్ కు సరిగ్గా సరిపోతారని పేర్కొంది.

అన్ని వయసుల భారతీయ ప్రేక్షకులతో లోతైన అనుబంధం ఉన్న షారూఖ్ ఖాన్ కాండెరే బ్రాండ్ ఉత్పత్తులకు సంబంధించి డిజిటల్, టెలివిజన్, ప్రింట్, ఇన్-స్టోర్ మల్టీమీడియా ప్రచారాలలో కనిపిస్తారు. ''కాండెరే జీవనశైలి ఆభరణాల విభాగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఈ బ్రాండ్ మహిళల కోసం సమకాలీన ఆభరణాలకు విస్తృత...