భారతదేశం, జనవరి 21 -- ప్రముఖ నగల విక్రయ సంస్థ 'కళ్యాణ్ జువెలర్స్' (Kalyan Jewellers) షేర్లు స్టాక్ మార్కెట్‌లో తీవ్ర ఒడుదొడుకులకు లోనవుతున్నాయి. బుధవారం ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ షేరు ధర దాదాపు 14 శాతం పతనమై తన 52 వారాల కనిష్ట స్థాయి Rs.390ని తాకింది. గత తొమ్మిది సెషన్లుగా వరుసగా నష్టపోతూ, ఈ కాలంలోనే పెట్టుబడిదారుల సంపదను 25 శాతం మేర ఆవిరి చేసింది.

కంపెనీ ప్రాథమికాంశాల్లో (Fundamentals) పెద్దగా లోపాలేమీ లేవని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయంగా బంగారం ధరల్లో కనిపిస్తున్న అస్థిరత ఈ షేర్లపై ఒత్తిడి పెంచుతోందని విశ్లేషిస్తున్నారు. ఫిబ్రవరి 6వ తేదీన కంపెనీ తన మూడో త్రైమాసిక (Q3) ఫలితాలను వెల్లడించనుంది. ఈ ఫలితాల కోసం మార్కెట్ ఆసక్తిగా ఎదురుచూస్తోంది.

ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ మోతీలాల్ ఓస్వాల్ ప్రకారం.. కంపెనీ ప్రదర్శన ఆశాజనకంగానే ఉండవచ్చ...