Hyderabad, మార్చి 19 -- ప్రతి ఇంట్లో ప్రతిరోజూ గిన్నెలు తోమాల్సిందే. అయితే కొన్ని కొన్నిసార్లు ఆహారం మాడిపోయి అడుగున నల్లగా అయిపోతుంది. దాన్ని శుభ్రం చేయడం కూడా కష్టంగా అనిపిస్తుంది. ముఖ్యంగా వేపుళ్లు చేసినప్పుడు ఇలా మాడిపోయే అవకాశం ఎక్కువ. కళాయి కింద గ్రీజు పెరిగిపోయినప్పుడు, దాన్ని తోమలేక మహిళలు రెండు మూడు రోజులు అలా నీళ్ళల్లో వేసి వదిలేస్తారు. అటువంటి పరిస్థితుల్లో మీరు చిన్న చిట్కాలు ద్వారా ఆ మాడిపోయిన పాత్రను నిమిషాల్లో శుభ్రం చేసుకోవచ్చు.

కళాయి మాడిపోయినప్పుడు మీరు బేకింగ్ సోడా, వెనిగర్ తో ఆ మాడును తొలగించవచ్చు. చిన్న గ్లాసు నీరు తీసుకొని అందులో వెనిగర్ ను కలపండి. ఇప్పుడు మాడిపోయిన కళాయిని స్టవ్ మీద పెట్టి వెనిగర్ కలిపిన నీటిని అందులో వేయండి. చిన్న మంట మీద వేడి చేయండి. ఆ కళాయిలోనే రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా కూడా వేసి కలుపుతూ...