భారతదేశం, నవంబర్ 19 -- తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అరెస్ట్ అయ్యారు. ఆనెను నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు పోలీసులు తరలించారు. సింగరేణి సంస్థలో డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించడం, మెడికల్ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని డిమాండ్‌తో నాంపల్లిలోని సింగరేణి భవన్‌ను కవితతోపాటుగా ఆ సంస్థ నేతలు ముట్టడించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు కల్వకుంట్ల కవిత అక్కడకు ఆటోలో వచ్చారు. నాంపల్లిలోని సంగరేణి భవన్‌ను కవిత, జాగృతి నేతలు, హెచ్ఎంఎస్ నాయకులు ముట్టడించే ప్రయత్నం చేయగా దీంతో అక్కడ కాసేపు టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇరువైపులా తోపులాట జరిగింది. స్థానికంగా ఉద్రిక్త వాతావరణంతో పరిస్థితి అదుపు తప్పేలా కనిపించింది. దీంతో కవితతోపాటుగా మరికొందరి నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు.

తెలంగాణలోని బొగ్గు బ్లాకుల వేలాన్...