భారతదేశం, డిసెంబర్ 8 -- బిగ్ బాస్ 9 తెలుగు పదమూడో వారం షాకింగ్ ఎలిమినేషన్ చోటు చేసుకుంది. గ్లామర్, ఆటతో అలరించిన జబర్దస్త్ బ్యూటీ, యాంకర్ రీతూ చౌదరి ఎలిమినేట్ అయింది. ఎలిమినేషన్ అనంతరం కంటెస్టెంట్స్ అంతా బిగ్ బాస్ బజ్ ఇంటర్వ్యూలో పాల్గొంటారని తెలిసిందే.

ఈ క్రమంలో హీరో శివాజీ హోస్ట్‌గా చేస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 బజ్ ఇంటర్వ్యూకి హాజరైంది రీతూ చౌదరి. రీతూ రాగానే "నీకు ఒక నిజం చెబుతాను. నువ్ మ్యాగ్జిమమ్ ఎప్పుడు ఏడ్చావో అప్పుడు కన్నీళ్లు రాలేదు అమ్మాయి" అని శివాజీ అన్నాడు. దానికి "ఇంకిపోయాయి మరి ఏడ్చి ఏడ్చి" అని రీతూ చెప్పింది.

"ఓరి బాబో.." అంటూ హేళన చేశాడు శివాజీ. దానికి హౌజ్‌లో నవ్వినట్లుగానే రీతూ నవ్వింది. "రీతూ గేమ్ మీద ఫోకస్ చేయడం కన్నా డిమాన్ మీద ఫోకస్ చేయడం వల్ల రీతూ ఎందుకో వెనుకపడింది.. సారీ డిమాన్ వెంటపడింది" అని శివాజీ అన్నాడు. ద...