భారతదేశం, నవంబర్ 28 -- తిరుమల లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా కేసులో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటికే ఈ కేసులో పలువురిని సిట్ అరెస్ట్ చేయగా. తాజాగా టీటీడీలో కూడా తొలి అరెస్ట్ నమోదైంది. అప్పట్లో కొనుగోళ్ల విభాగం జనరల్‌ మేనేజర్‌గా ఉన్న ఆర్‌ఎస్‌ఎస్‌వీఆర్‌ సుబ్రహ్మణ్యాన్ని సిట్‌ అధికారులు గురువారం అరెస్ట్ చేశారు.

రుయా ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత నెల్లూరులోని ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టారు. అతనికి కోర్టు. డిసెంబరు 10 వరకు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో సుబ్రహ్మణ్యం 29వ నిందితుడిగా ఉన్నాడు. టీటీడీ మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి మాజీ పీఏ చిన్న అప్పన్న (ఏ24)కు సుబ్రహ్మణ్యం సహకరించారని సిట్‌ ఇప్పటికే గుర్తించింది.

తాజాగా అరెస్ట్ అయిన ఆర్ఎస్ఎస్వీఆర్ సుబ్రహ్మణ్యం గతంలో టీటీడీలో జనరల్ మేనేజర్ (ప్రొక్యూర్మెంట్) గా ప...