Hyderabad, సెప్టెంబర్ 1 -- ప్రభాస్ కల్కి 2898 ఏడీ సీక్వెల్ పై ఎంతో ఆసక్తి నెలకొంది. గతేడాది వచ్చిన ఫస్ట్ పార్ట్ బాక్సాఫీస్ దగ్గర రూ.1000 కోట్లకుపైగా వసూలు చేయడంతో ఈ రెండో పార్ట్ ఎప్పుడా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనిపై డైరెక్టర్ నాగ్ అశ్విన్ కీలకమైన అప్డేట్ ఇచ్చాడు. తాజాగా యువర్స్ హోలిస్టికల్లీ బై ప్రియాంకా రెడ్డి పాడ్‌కాస్ట్ లో అతడు మాట్లాడాడు.

ఈ పాడ్‌కాస్ట్ లో నాగ్ అశ్విన్ ను ప్రియాంకా రెడ్డి ఓ ఇంట్రెస్టింగ్ ప్రశ్న అడిగారు. దీనికి సమాధానం చెప్పి తీరాల్సిందే అని అన్నారు. కల్కి 2 ఎప్పుడు అని ఆమె అడగ్గానే.. మైక్ పని చేయడం లేదు అని నాగ్ అశ్విన్ జోక్ చేశాడు. బాగానే పని చేస్తోంది చెప్పండి అని ఆమె అనగానే..

"యాక్టర్స్ అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఇక ముందుగా మేము విజువలైజ్ చేసుకున్న యాక్షన్ సీక్వెన్సెస్ చాలా గ్రాండ్ గా ఉన్నాయి. ...