భారతదేశం, సెప్టెంబర్ 20 -- కల్కి 2898 ఏడీ మేకర్స్, దీపికా పదుకొణె మధ్య వివాదం కొనసాగుతున్నట్లే కనిపిస్తోంది. ఈ మూవీ సీక్వెల్ లో దీపికా భాగం కాదని కల్కి మేకర్స్ ప్రకటించడం సంచలనంగా మారింది. ఆ తర్వాత కర్మ అంటూ కల్కి డైరెక్టర్ నాగ్ అశ్విన్ సోషల్ మీడియాలో పోస్టు పెట్టడం గమనార్హం. ఇప్పుడు కల్కి నుంచి వేటు తర్వాత దీపికా పదుకొణె ఇన్ స్టాగ్రామ్ లో పెట్టిన పోస్టు వైరల్ గా మారింది.

తాజాగా ఇన్ స్టాగ్రామ్ లో దీపికా పదుకొణె పోస్టు వైరల్ గా మారింది. కల్కి 2898 ఏడీ మూవీ మేకర్స్ కు కౌంటర్ గానే దీపికా ఈ పోస్టు పెట్టిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి. ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షారూక్ ఖాన్ చేతిని పట్టుకున్న ఫోటోను పంచుకుంది. ఆమె షారూక్ ఖాన్ తో ఉన్న దీర్ఘకాల సంబంధం గురించి క్యాప్షన్ రాసింది.

''దాదాపు 18 సంవత్సరాల క్రితం ఓం శాంతి ఓం చిత్రీకరణ సమయంలో ఆయన నా...