భారతదేశం, మే 13 -- తరుణ్ మూర్తి దర్శకత్వంలో మోహన్ లాల్, శోభన జంటగా నటించిన తుడరుమ్ బాక్సాఫీస్ కలెక్షన్ల ఊచకోత కొనసాగుతోంది. ఈ మలయాళ బ్లాక్ బస్టర్ రికార్డు కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఇండియాలోనే రూ.100 కోట్ల నెట్ వసూళ్లతో అదరగొట్టింది. ఇక కేరళలోనే అత్యధిక గ్రాస్ కలెక్షన్లు సాధించిన మూవీగా తుడరుమ్ ఇప్పటికే హిస్టరీ క్రియేట్ చేసింది. ఇక ఓవరాల్ గా ఆల్ టైమ్ గ్రాస్ కలెక్షన్లలో మూడో మలయాళ సినిమాగా నిలిచింది.

తుడరుమ్ రిలీజై 18 రోజులైనా కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలకడ కొనసాగిస్తోంది. 18వ రోజు (మే 12) ఈ మూవీ ఇండియాలో రూ.2.49 కోట్ల నెట్ వసూలు చేసినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ వెల్లడించింది. ఏప్రిల్ 25న రిలీజైన ఈ మలయాళ సూపర్ హిట్ మూవీ 18 రోజుల్లో ఇండియాలో రూ.101.53 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టిందని సక్నిల్క్ పేర్కొంది.

పెద్దగ...