భారతదేశం, జూన్ 10 -- బాలీవుడ్ లో కామెడీ సినిమాలు అనగానే ముందుగా గుర్తొచ్చే ఫ్రాంఛైజీ.. హౌస్‌ఫుల్. ఈ ఫ్రాంఛైజీలో వచ్చిన సినిమాలన్నీ కడుపుబ్బా నవ్వించి కలెక్షన్ల మోత మోగించాయి. ఇప్పుడు ఇదే ఫ్రాంఛైజీలో వచ్చిన రీసెంట్ మూవీ హౌస్‌ఫుల్ 5 కూడా వసూళ్లలో అదరగొడుతోంది. కలెక్షన్లు కుమ్మేస్తోంది. ఈ మూవీ రూ.100 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టింది. బాక్సాఫీస్ దగ్గర నిలకడగా సత్తాచాటుతోంది.

హౌస్‌ఫుల్ 5 మూవీ జూన్ 6న రిలీజ్ అయింది. అక్షయ్ కుమార్, నర్గీస్ ఫఖ్రీ, అభిషేక్ బచ్చన్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్, రితేష్ దేశ్ముఖ్, సౌందర్య శర్మ తదితరులు నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర నిలకడగా రాణిస్తోంది. సక్నిల్క్ వెబ్ సైట్ ప్రకారం ఈ హిందీ సినిమా నాలుగు రోజుల్లోనే ఇండియాలో రూ.101 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టింది. సోమవారం (జూన్ 9) ఈ సినిమాకు రూ.13.50 కోట్ల నెట్ వసూళ్లు వచ్చా...