భారతదేశం, ఆగస్టు 3 -- హోంబలే ఫిలింస్ సమర్పణలో క్లీమ్ ప్రొడక్షన్స్ నిర్మించిన యానిమేటెడ్ చిత్రం మహావతార్ నరసింహ రెండో వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అనూహ్యంగా రన్ అవుతోంది. ప్రహ్లాదుడి కథ, మహావతార్ నరసింహుడి ఎదుగుదల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రానికి అశ్విన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం అభిమానుల మనసులను గెలుచుకుంది. రెండో వారాంతంలో 100 శాతం వసూళ్లు రాబట్టింది.

మహావతార్ నరసింహ మూవీ కలెక్షన్లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ తాజా అప్డేట్ ప్రకారం.. మహావతార్ నరసింహ రెండవ శనివారం (ఆగస్టు 2) రూ.15.4 కోట్లు వసూలు చేసింది. అంతకు ముందు రోజుతో పోలిస్తే 100 శాతం పెరిగి అదనంగా రూ.7.7 కోట్లు రాబట్టింది. రెండో వారంలో ఇంత భారీ వసూళ్లు రాబట్టడం ఊహించనిదే. ఈ సినిమా చూసిన అభిమానుల నుంచి మంచి రెస్పాన్స్ రావడమే మరింత ఊపునిస్తోంది.

వీ...