భారతదేశం, జూన్ 25 -- తమిళ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున ప్రధాన పాత్రలు పోషించిన కుబేర చిత్రం బాక్సాఫీస్ వద్ద అదరగొడుతోంది. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించి పాజిటివ్ టాక్ దక్కించుకుంది. జూన్ 20న విడుదలైన ఈ చిత్రానికి సూపర్ రెస్పాన్స్‌తో పాటు జోరుగా కలెక్షన్లు దక్కుతున్నాయి. ఈ క్రమంలో కుబేర చిత్రం ముఖ్యమైన మైల్‍స్టోన్ సాధించింది.

కుబేర సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.100కోట్ల గ్రాస్ కలెక్షన్ల మార్క్ దాటింది. ఐదు రోజుల్లోనే ఈ మైల్‍స్టోన్‍ను అధిగమించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూన్ 25) వెల్లడించింది. కుబేర వరల్డ్ వైడ్‍గా రూ.100కోట్ల గ్రాస్‍ను క్రాస్ చేసిందంటూ ఓ పోస్టర్ కూడా తీసుకొచ్చింది. దర్శకుడు శేఖర్ కమ్ముల తొలిసారి రూ.100కోట్ల క్లబ్‍లోకి అడుగుపెట్టారు.

కుబేర చిత్రం తెలుగు, తమిళంలో ద్విభాషా చిత్రంగా ...