భారతదేశం, జూలై 28 -- చాలా గ్యాప్ తర్వాత పవన్ కల్యాణ్ సినిమా థియేటర్లకు వచ్చింది. నార్మల్ గానే పవన్ సినిమా వచ్చిందంటే ఓ ఊపు ఉంటుంది. ఓ సందడి ఉంటుంది. బాక్సాఫీస్ షేక్ అవుతుంది. కానీ గ్యాప్ తర్వాత వచ్చినప్పటికీ పవన్ లేటెస్ట్ మూవీ హరి హర వీరమల్లు మాత్రం ఆ పాజిటివ్ ఎనర్జీ క్రియేట్ చేయలేకపోయిందనే టాక్ వినిపిస్తోంది. సినిమాకు నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవుతుండటం కలెక్షన్లపై ప్రభావం చూపిస్తోంది. నాలుగు రోజైన సండే (జులై 27) కూడా కలెక్షన్లు పెద్దగా పుంజుకోలేకపోవడం గమనార్హం.

హరి హర వీరమల్లు సినిమా గురువారం (జులై 24) థియేటర్లలో రిలీజైంది. అంతకంటే ముందు రోజు స్పెషల్ గా ప్రీమియర్ షోలు కూడా వేశారు. అయితే సినిమా రిలీజ్ అయ్యాక వచ్చిన ఫస్ట్ సండే ఈ సినిమాకు ఆశించిన స్థాయిలో వసూళ్లు రాలేదు. ట్రేడ్ వెబ్ సైట్ సక్నిల్క్ ప్రకారం హరి హర వీరమల్లు ఆదివారం ఇండియాలో రూ....