Hyderabad, జూన్ 18 -- మనం నిద్రపోయినప్పుడు ఎన్నో కలలు వస్తూ ఉంటాయి. కలల వెనుక సంకేతాలు ఉంటాయి. కొన్ని కలలు మంచి ఫలితాలను ఇస్తే, కొన్ని కలలు చెడు ఫలితాలను ఇస్తాయి. అప్పుడప్పుడు మనకి పీడ కలలు కూడా వస్తూ ఉంటాయి. స్వప్న శాస్త్రం ప్రకారం మనకి వచ్చే కలల ఆధారంగా, వాటి వెనుక అర్థం తెలుసుకుని దానికి తగ్గట్టుగా వ్యవహరించవచ్చు. కలలో శనిదేవుడు కనపడితే మంచిదా కాదా అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం.

నిద్రపోయినప్పుడు కలలో శనిదేవుడు కనబడితే దానికి అర్థం ఏంటి? దాని వలన మంచి ఫలితాలు ఎదురవుతాయా, చెడు ఫలితాలను ఎదుర్కోవాల్సి ఉంటుందా అనే విషయాన్ని చూద్దాం. కొంతమంది ఇప్పటికే శని సాడే సతి, ధయ్యా ప్రభావంలో ఉన్నారు. వారు ఈ సమయంలో శనిదేవుడిని కలలో చూసినట్లయితే, శనిదేవుడి దృష్టి ప్రభావం తగ్గుతుంది. అంతేకాకుండా ఆ వ్యక్తి బాధలు కూడా తొలగిపోతాయి. ఈ కల శుభ ఫలితాలను ఇస్త...