భారతదేశం, డిసెంబర్ 28 -- "కలలు కనడానికి వయసుతో సంబంధం లేదు.. కష్టపడే తత్వం ఉంటే చాలు" అని నిరూపించారు ఓ 52 ఏళ్ల మహిళ. తన జీవితంలోనే మొదటి సంపాదనను ఈ వయసులో యూట్యూబ్ ద్వారా అందుకోవడంతో ఆమె కళ్లలో మెరిసిన ఆనందం, ఆ ఆనందంలో దాగి ఉన్న చిన్నపాటి కన్నీళ్లు ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్ల మనసు గెలుచుకుంటున్నాయి.

అన్షుల్ పారీక్ అనే యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌ను ఊపేస్తోంది. వీడియోలో అన్షుల్ తన తల్లిని "ఏమైంది మమ్మీ?" అని అడగ్గా.. ఆ తల్లి ఎంతో గర్వంగా, భావోద్వేగంతో సమాధానమిచ్చారు. "నా 52 ఏళ్ల జీవితంలో మొదటిసారి సొంతంగా సంపాదించాను. అదీ యూట్యూబ్ ద్వారా.. కేవలం ఆరు నెలల్లోనే ఇది సాధ్యమైంది" అని ఆమె చెబుతుంటే, ఆ మాటల్లో ఒక రకమైన ఆత్మవిశ్వాసం ఉట్టిపడింది. "నేను చాలా గర్వపడుతున్న కూతురిని" అంటూ అన్షుల్ ఈ వీడియోకు క్యాప...