Hyderabad, అక్టోబర్ 7 -- కర్వా చౌత్ రాశి ఫలాలు 2025: వివాహిత మహిళలకు కర్వా చౌత్ ఉపవాసం చాలా ప్రత్యేకమైనది. ఈ ఏడాది అక్టోబర్ 10 శుక్రవారం కర్వా చౌత్ పాటించనున్నారు. ప్రతి సంవత్సరం, ఆశ్వయుజ మాసంలోని కృష్ణ పక్షం నాల్గవ రోజున, వివాహిత మహిళలు తమ భర్తల దీర్ఘాయుష్షు, సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటూ ఉపవాసం పాటిస్తారు.

ఈ రోజున మహిళలు ఆహారం, నీరు తీసుకోకుండా సూర్యోదయం నుండి చంద్రోదయం వరకు ఉపవాసం వుంటారు. సాయంత్రం గౌరీ మాతను పూజించి, చంద్రుడికి అర్ఘ్యం సమర్పించిన తరువాత, ఉపవాసం విరమిస్తారు. అయితే ఉత్తరభారతదేశంలో కర్వా చౌత్ నాడే దక్షిణ భారతదేశంలో అట్లతద్దిని అదే రోజు జరుపుతారు.

ఈ సంవత్సరం, కర్వా చౌత్ పై గ్రహాలు, నక్షత్ర, రాశుల స్థానం చాలా శుభప్రదంగా ఉండబోతోంది. అందువల్ల ఈ కర్వా చౌత్ లేదా అట్లతద్ది చాలా శుభప్రదమైనదిగా పరిగణించబడుతుంది. అక్టో...