భారతదేశం, ఏప్రిల్ 24 -- తెలంగాణ-చత్తీస్‌ఘడ్‌ సరిహద్దుల్లో కర్రెగుట్ట ప్రాంతంలో జరుగుతున్న కాల్పుల వ్యవహారంపై తమకు అధికారికంగా ఎలాంటి సమాచారం లేదని వరంగల్ రేంజీ ఐజీ చంద్రశేఖర్‌ రెడ్డి ప్రకటించారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో లొంగిపోయిన మావోయిస్టులకు ఐజీ నగదు ప్రోత్సహకాలు అందచేశారు.

చత్తస్‌‌ఘడ్‌కు చెందిన 13మంది మావోయిస్టులు వరంగల్ పోలీసులు ఎదుట లొంగింపోయారు. తెలంగాణ ప్రభుత్వం మావోయిస్టుల అణిచివేత కంటే వారిని జనజీవన స్రవంతిలోకి తీసుకురావడంపై దృష్టి సారించినట్టు ఐజీ చెప్పారు. మావోయిస్టులు ప్రజా జీవితంలోకి రావాాలని తాము కోరుకుంటున్నట్టు చెప్పారు. ఈ క్రమంలో కర్రెగుట్ట ఎన్‌కకౌంటర్‌పై ఐజీ స్పందించారు.

కర్రెగుట్ట సిఆర్‌పిఎఫ్‌ బలగాల కూంబింగ్‌ ఆపరేషన్‌ గురించి తెలంగాణ ప్రభుత్వానికి ఎలాంటి సమాచారం లేదని ఐజీ చెప్పారు. చత్తీస్‌ఘడ్‌లో ఉన్న సిఆ...