భారతదేశం, మే 11 -- తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దులోని కర్రెగుట్టలను కొన్ని రోజులుగా సాయుధ బలగాలు జల్లెడపట్టాయి. ఆపరేషన్‌ కగార్‌ పేరుతో మావోయిస్టుల ముఖ్యమైన స్థావరాల్లోకి దూసుకెళ్లి.. విరుచుకుపడ్డాయి. ఈ క్రమంలో పదుల సంఖ్యలో మావోయిస్టులు హతమయ్యారు. ఇలా ఆపరేషన్ జరుగుతున్న సమయంలో.. సడెన్‌గా బలగాలు వెనక్కి తగ్గాయి. సీఆర్‌పీఎఫ్‌ బలగాలు వెనక్కి రావాలని కేంద్ర హోంశాఖ నుంచి ఆదేశాలు వచ్చాయి. దీనికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు ఇలా ఉన్నాయి.

1.కర్రెగుట్టల్లో మావోయిస్టుల కోసం జల్లెడపడుతున్న బలగాలు ఇవాళ సాయంత్రంలోపు సరిహద్దు హెడ్‌క్వార్టర్స్‌లో రిపోర్ట్‌ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. దీంతో కేంద్ర బలగాలు వెనక్కి వెళ్లడం వ్యూహాత్మక ఎత్తుగడా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

2.వచ్చే ఏడాది మార్చి నాటికి మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని అమిత్‌ షా చాలాసార్లు...