భారతదేశం, మే 7 -- తెలంగాణ-చత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో జరుగుతున్న ఆపరేషన్‌ కగార్‌లో బుధవారం తెల్లవారు జామున భారీ ఎన్‌కౌంటర్‌ జరిగింది. గత పక్షం రోజులుగా కర్రెగుట్టల్ని కేంద్ర సాయుధ బలగాలు జల్లెడ పడుతున్నాయి. ఈ క్రమంలో బుధవారం తెల్లవారుజామున జరిగిన ఎన్‌కౌంటర్‌లో 22 మంది మావోయిస్టులు మృతి చెందారు.

కర్రెగుట్టల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఆశ్రయం పొందుతున్నారనే సమాచారంతో గత కొన్ని రోజులుగా దాదాపు 24వేల మంది సాయుధ బలగాలు కొండల్ని జల్లెడ పడుతున్నారు. తెలంగాణ-చత్తీస్‌గడ్‌ సరిహద్దుల్లో 90 కిలోమీటర్లకు పైగా పొడవున విస్తరించి ఉన్న కర్రెగుట్టల్ని అణువణువు తనిఖీ చేస్తున్నాయి.

ఈ క్రమంలో ఇప్పటి వరకు జరిగిన ఎదురు కాల్పుల్లో స్వల్ప సంఖ్యలోనే మావోయిస్టులు చనిపోయారు. మరోవైపు కర్రెగుట్టల్లో మావోయిస్టులు అమర్చిన మందుపాతరలు పేలి జవాన్లు గాయపడుతున్నారు. ఎండ తీవ...