భారతదేశం, మే 5 -- కర్రెగుట్టల్లో ఆపరేషన్‌ కగార్‌ కొనసాగుతుంది. సాయుధ బలగాలు మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో బలగాలు అలర్ట్ అయ్యాయి. క్షుణ్నంగా పరిశీలిస్తూ.. ముందుకు సాగుతున్నాయి.

ఏప్రిల్ 8న సీపీఐ మావోయిస్టు పార్టీ వెంకటాపురం-వాజేడు ఏరియా కమిటీ కార్యదర్శి శాంత పేరుతో ఓ లేఖ విడుదల అయ్యింది. షికారు పేరుతో కర్రిగుట్ట పైకి వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవద్దని అందులో మావోయిస్టులు స్పష్టం చేశారు. మావోయిస్టులు విడుదల చేసిన ఈ లేఖ అప్పట్లో సంచలనంగా మారింది. ఈ లేఖ విడుదలైన తర్వాత.. బలగాలు ఆపరేషన్ కర్రెగుట్టను చేపట్టాయి. అప్పటి నుంచి మావోయిస్టుల కోసం గాలిస్తున్నాయి.

'ఆపరేషన్ కగార్ పేరుతో చేస్తున్న ...