భారతదేశం, ఏప్రిల్ 26 -- తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కర్రెగుట్ట ప్రాంతంలో కూంబింగ్‌ కొనసాగుతోంది. హెలికాప్టర్‌లు, డ్రోన్లు, అత్యాధునిక ఆయుధాలతో.. సాయుధ బలగాలు కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. ఈ క్రమంలో భారీ స్థాయిలో ఎదురు కాల్పులు జరిగినట్టు తెలుస్తోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో పదుల సంఖ్యలో మావోయిస్టులు మృతిచెందినట్టు సమాచారం. అయితే.. ఈ ఎన్‌కౌంటర్‌కు సంబంధించి అటు ఛత్తీస్‌గఢ్, తెలంగాణ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు.

కర్రెగుట్టలో కేంద్ర పాలరామిలటరీ బలగాల నేతృత్వంలో కూంబింగ్ ఆపరేషన్ కొనసాగుతుంది. మావోయిస్టు మోస్ట్ వాంటెడ్ నేతలు హిడ్మా, దేవ టార్గెట్‌గా ఐదు రోజులుగా ఈ కూంబింగ్ కొనసాగుతుంది. దాదాపు 20 వేల మంది బలగాలు ఈ ఆపరేషన్‌లో పాల్గొన్నట్టు సమాచారం. శనివారం ఉదయం కర్రెగుట్టలో మావోయిస్టులు, భద్రతా బలగాల మధ్య భీకర కాల్పులు జరిగినట్టు తెలు...