Hyderabad, మే 7 -- ప్రపంచంలోనే అత్యంత లోతైన, ఆధ్యాత్మిక, తాత్విక గ్రంథాలలో భగవద్గీత ఒకటి. పాండవులు, కౌరవుల మధ్య జరిగిన కురుక్షేత్ర యుద్ధంలో శ్రీకృష్ణుడు అర్జునుడు మధ్య జరిగిన సంభాషణే భగవద్గీతగా రూపాంతరం చెందింది. ఇప్పటికే హిందువులకు భగవద్గీత ఆచరణీయమైన పాఠం.

పాండవులలో అత్యంత శక్తివంతమైన వాడు అర్జునుడు. అతడే కురుక్షేత్ర యుద్ధం ప్రారంభంలో తన బంధువులను, స్నేహితులను చూసి బాణం విడవలేక నిలబడి అచేతనంగా ఉండిపోతాడు. అలాంటి సమయంలో శ్రీకృష్ణుడు అతడికి జ్ఞానబోధ చేస్తాడు. ఆ జ్ఞానబోధ భగవద్గీతగా మారి ఈనాటి తరాలకు మార్గ నిర్దేశం చేస్తోంది.

భగవద్గీతలో ప్రతి ఒక్కరూ గుర్తు చేసుకోవాల్సిన వాక్యం కర్మణ్యే వాధికారిస్తే మా ఫలేశు కథాచనా. అంటే మీ చర్యలపై మాత్రమే మీకు నియంత్రణ ఉంటుంది.. దాని ఫలితాలపై మీరు ఎలాంటి హక్కును కలిగి ఉండరు. దీన్ని బట్టి మీరు పని మాత్రమే చ...