భారతదేశం, అక్టోబర్ 30 -- కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ఇటీవల బస్సు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. 19 మంది ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. అంతకుముందు బైకర్ శివశంకర్ మరణించాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అయితే తాజాగా కర్నూలు బస్సు ప్రమాద దర్యాప్తులో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. పోలీసులు మూడో వ్యక్తి కోసం వెతుకుతున్నారు. అదే రోడ్డు మీదుగా వెళ్ళిన మరో ఓమ్ని బస్సు డ్రైవర్ గురించి సెర్చింగ్ నడుస్తోంది.

ఈ బస్సు బైక్‌ను రోడ్డు మధ్యలోకి లాక్కెళ్లిందని, ఆ తర్వాతే హైదరాబాద్ - బెంగళూరు వెళ్తున్న వి కావేరీ ట్రావెల్స్ బస్సు దానిని ఢీకొట్టి మరో 300 మీటర్లు ఈడ్చుకెళ్లిందని పోలీసుల దర్యాప్తులో తెలిసింది. దీంతో మంటలు చెలరేగి 19 మంది ప్రయాణికులు మృతి చెందారు. బైక్ నడిపిన శివ శంకర్ మద్యం తాగి ఉన్నాడని, బెంగళూరు వెళ్తున్న బస్సు బైక్‌ను ఢీ...