భారతదేశం, నవంబర్ 7 -- కర్నూల్ లో చోటు చేసుకున్న బస్సు ప్రమాదం కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తున్నారు. తాజాగా వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు యజమాని వేమూరి వినోద్‌ కుమార్ ను ఇవాళ కర్నూల్ పోలీసులు అరెస్టు చేశారు.

అదుపులోకి తీసుకున్న తర్వాత స్పెషల్ మొబైల్ కోర్టులో హాజరుపరిచారు. అతనికి న్యాయస్థానం 14 రోజుల పాటు రిమాండ్‌ విధించింది. ఈ కేసులో ఏ1 గా ట్రావెల్స్ బస్సు డ్రైవర్ లక్ష్మయ్య ఉన్నారు. ఇప్పటికే అతడిని అరెస్ట్ చేయగా.. తాజాగా ఓనర్ ని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రయాణికుడు రమేష్‌ ఫిర్యాదుతో కేసు నమోదైంది. బీఎన్ ఎస్ లోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

కర్నూలు జిల్లాలో ఇటీవల(అక్టోబర్ 24,2025) జరిగిన బస్సు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. పలువురు గాయపడగా.. వారు చిక...