Hydarabad, Oct. 24 -- హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు కాలి బూడిదైన విషయం తెలిసిందే. కర్నూలు శివారు చిన్నకూటేరులో ఈ ఘటన జరిగింది. బస్సులో ముత్తం 44 మంది ఉన్నారు. ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరి సిబ్బంది, 40 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇందులో 19 మంది సజీవ దహనం అయ్యారు. ఈ మృతదేహాలను ఫోరెన్సిక్ బృందాలు వెలికితీశాయి. మరికొందరు గాయాలతో బయటపడ్డారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఒక డ్రైవర్ పోలీసులు అదుపులో ఉన్నాడు. ప్రయాణికుల్లో ఎక్కువగా తెలంగాణ వారు ఉన్నట్టుగా తెలుస్తోంది.

ఘటన జరిగిన సమయంలో ప్రయాణికులు గాఢ నిద్రలో ఉన్నారు. దీంతో ఒక్కసారిగా ఏం జరుగుతుందో వారికి అర్థం కాలేదు. పెద్ద శబ్ధం వినిపించింది. చూస్తూ ఉండగానే మంటలు వ్యాపించాయి. కొందరు ఎమర్జెన్సీ విండో నుంచి బయటకు దూకేశారు. బస్సు పూర్తిగా కాలి బూడిదైంది. ...