India, Oct. 25 -- కర్నూలు బస్సు ప్రమాద ఘటనపై పోలీసులు పలు కోణాల్లో విచారణ చేస్తున్నారు. ఇందులో విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. బైకర్ శివశంకర్ మద్యం మత్తులో ఉన్నట్టుగా తెలిసింది. ప్రమాదానికి ముందు పెట్రోల్ బంకులోకి వెళ్లిన దృశ్యాలు వైరల్‌గా అయ్యాయి. మరో యువకుడితో కలిసి బైకర్ శివశంకర్ పెట్రోల్ బంకుకు వెళ్లాడు. బైక్‌ను తీసే విధానం చూస్తే తాగి ఉన్నట్టుగా తెలుస్తోంది.

అయితే బైక్‌పై శంకర్‌తో పాటు ఉన్న మరో యువకుడు ఎర్రిస్వామిని పోలీసులు గుర్తించారు. ఎర్రిస్వామిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. బైక్‌ మీద శివ శంకర్‌ ఉన్న సమయంలో వీ కావేరీ ట్రావెల్స్‌ బస్సు ఢీకొట్టలేదని వెల్లడైంది. శంకర్‌, ఎర్రిస్వామి మద్యం మత్తులో వర్షంలో తడుస్తూనే బైక్ మీద వెళ్లినట్టుగా సమాచారం. చిన్నటేకూరు దగ్గర బైక్‌ స్కిడ్‌ అయ్యి కిందపడ్డారు. బైక్ రోడ్డు మధ్యలో ప...