భారతదేశం, మే 26 -- తొలకరి వర్షాలు కురుస్తుండటంతో కర్నూలు జిల్లా తుగ్గలి మండలం జొన్నగిరిలో వజ్రాల వేట ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి పొలాల్లో వజ్రాల కోసం వెతుకుతున్నారు. చిన్న వజ్రం దొరికినా తమ జీవితాలు మారిపోతాయనే ఆశతో పొలాలను జల్లెడ పడుతున్నారు. తుగ్గిలితో పాటు పరిసర ప్రాంతాల్లో వజ్రాల కోసం వెదుకుతున్న వారితో సందడిగా మారింది.

తొలకరి ప్రారంభం కావడంతో కర్నూలు జిల్లా పొలాల్లో వజ్రాల వెదుకులాట మొదలైంది. ఈ క్రమంలో వజ్రాలను వెదుకుతున్న వారిలో ఒకరికి అదృష్టం వరించినట్టు ప్రచారం జరిగింది. కర్నూలు జిల్లా మద్దికెర మండలంలోని పెరవలి కొల్లాపూర్ లక్ష్మీదేవి ఆలయం ప్రాంతంలో ఆదివారం ఒకరికి ఖరీదైన వజ్రం లభించినట్టు తెలుస్తోంది.

ఆదివారం రంగు రాళ్లను వెదుకుతున్న క్రమంలో రూ.30 లక్షల విలువ చేసే వజ్రం దొరికినట్లు సమాచారం అందడంత...