Andhrapradesh,kurnool, ఆగస్టు 20 -- కర్నూలు జిల్లాలో వర్షపు నీటితో నిండిన కుంటలో ఈతకు వెళ్లిన ఆరుగురు బాలురు నీట మునిగి చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానికంగా ఉన్న చిగలి గ్రామంలోని పాఠశాలలో చదువుతున్న ఏడుగురు చిన్నారులు తమ గ్రామానికి కిలోమీటరు దూరంలో ఉన్న నీటి కుంటకు ఈత కోసం వెళ్లారు.

ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కుంటలో భారీగా నీరు చేరింది. ఈ క్రమంలో కుంటలో ఈతకు దిగిన విద్యార్థుల్లో శశికుమార్, కిన్నెర సాయి, సాయి కిరణ్, భీమా, వీరేంద్ర, మహబూబ్ ప్రాణాలు కోల్పోయారు. మరో విద్యార్థి గ్రామంలోకి వెళ్లి ప్రమాదం విషయం చెప్పాడు.

గ్రామస్తులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అనంతరం గుంతలో నుంచి మృతదేహాలను వెలికితీసే ప్రయత్నాలు చేపట్టారు. వెంటనే మృతదేహాలను బయటికి తీశారు. ఆరుగురు చిన్నారుల మృతిపట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర ది...