భారతదేశం, మే 23 -- కర్ణాటక రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా పీపుల్స్ పల్స్ రీసెర్చ్ సంస్థ, కొడెమో టెక్నాలజీస్ సంయుక్తంగా నిర్వహించిన ''పల్స్ ఆఫ్ ది కర్ణాటక స్టేట్'' సర్వేలో సిద్దరామయ్య నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ప్రజా వ్యతిరేకత కనిపిస్తుండగా, ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీజేపీకి ప్రజాదరణ పెరుగుతోందని వెల్లడైంది. తొలి 24 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆదరణ తగ్గుతున్న దశలో రానున్న 36 నెలలు కాలం కాంగ్రెస్ ప్రభుత్వానికి మరింత కీలకం కానున్నది.

సాధారణంగా ఏ ప్రభుత్వానికైనా మొదటి దశలో ఉన్న ఆదరణ రెండో దశలో తగ్గుతుంటుంది. మొదటి రెండు సంవత్సరాల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఆదరణ కోల్పోతూ ఉంటే రానున్న 3 సంవత్సరాల కాలంలో తమ ప్రతిష్టను ఏ విధంగా కాపాడుకుంటుందో అన్నది వేచి చూడాలి.

కర్ణాటకలో ఈ రో...