భారతదేశం, జనవరి 20 -- కర్ణాటక పోలీస్ విభాగంలో ప్రకంపనలు రేగుతున్నాయి. సీనియర్ ఐపీఎస్ అధికారి, డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (సివిల్ రైట్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్) కే రామచంద్రరావుపై ప్రభుత్వం సస్పెన్షన్ వేటు వేసింది. ఒక మహిళతో ఆయన అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్టు ఉన్న వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. మహిళలతో రామచంద్రరావు మాట్లాడుతున్నట్టుగా ఉన్న అనేక ఆడియో క్లిప్పులు కూడా వెలుగులోకి వచ్చాయి.

ఈ వ్యవహారంపై ముఖ్యమంత్రి సిద్ధరామయ్య విచారణకు ఆదేశించిన మరుసటి రోజే రామచంద్రరావుపై వేటు పడింది.

బెళగావిలో విలేకరులతో మాట్లాడిన ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఈ ఘటనపై తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. "సోమవారం నాడే ఈ వీడియో క్లిప్పులు నా దృష్టికి వచ్చాయి. మూడు వేర్వేరు క్లిప్పులను కలిపి ఈ వీడియో రూపొందించినట్లు తెలుస్తోంది. అధికారి...