భారతదేశం, జూన్ 6 -- భారీ అంచనాలు.. కానీ మరోవైపు వివాదాల మధ్య రిలీజైన థగ్ లైఫ్ మూవీ ఫస్ట్ డే బాగానే కలెక్షన్లు రాబట్టింది. 1987లో వచ్చిన నాయకన్ మూవీ తర్వాత డైరెక్టర్ మణిరత్నం, దిగ్గజ యాక్టర్ కమల్ హాసన్ కాంబోలో ఈ మూవీ రావడంతో క్రేజీ బజ్ ఏర్పడింది. ట్రైలర్ కూడా మూవీపై అంచనాలు పెంచేసింది. పవర్ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా థియేటర్లకు వచ్చింది ఈ మూవీ. గురువారం (జూన్ 5) రిలీజైంది థగ్ లైఫ్. ఈ మూవీ ఫస్ట్ డే కలెక్షన్లు ఉన్నాయి.

కమల్ హాసన్ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్ థగ్ లైఫ్ ఫస్ట్ డే ఇండియాలో రూ.17 కోట్ల నెట్ కలెక్షన్లు రాబట్టినట్లు సక్నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. తమిళం, తెలుగు, హిందీ భాషల్లో గురువారం రిలీజైంది ఈ మూవీ. ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. యాక్షన్ సీక్వెన్స్ అదిరిపోయాయని అంటున్నారు.

థగ్ లైఫ్ గురువారం 52.06% తమిళ ఆక్యుపెన్సీని కలిగి ...