భారతదేశం, ఏప్రిల్ 18 -- శుక్రవారం తెల్లవారుజామున కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో నలుగురు ఏపీ వాసులు మృతి చెందారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లా దేవదుర్గ తాలూకాలోని అమరాపుర క్రాస్ సమీపంలో ఈ ఘటన జరిగింది. హిందూపూరం మండలానికి చెందిన నలుగురు వ్యక్తులు మరణించగా.. ఒకరు తీవ్రంగా గాయపడ్డారు.

బొలెరో పికప్ వాహనంలో ప్రయాణిస్తూ.. యాద్గిర్ జిల్లాలోని షాపూర్ వైపు వెళుతున్నారు. ఆ వాహనం డ్రైవర్ నియంత్రణ కోల్పోయి అమరాపుర క్రాస్ సమీపంలోని వంతెనను ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో వాహనంలోని నలుగురు ప్రయాణికులు నాగరాజ్, సోమ, నాగభూషణ్, మురళి మరణించారు. డ్రైవర్ ఆనంద్ గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. గబ్బూర్ పోలీసులు ఈ ప్రమాదానికి గల కారణాన్ని తెలుసుకోవడానికి.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Published by HT Digit...