భారతదేశం, నవంబర్ 5 -- కర్ణాటకలోని హల్లిఖేడ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, వ్యాన్ ఢీకొట్టుకోవటంతో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో తెలంగాణకు చెందిన నలుగురు ప్రాణాలు కోల్పోయారు. మరో వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు.

మృతులను సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్‌ మండలం జగన్నాథ్‌పూర్‌ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వీరిలో నవీన్ (40), రాచప్ప (45), కాశీనాథ్ (60), నాగరాజు (40) ఉన్నారు. వీరంతా గానుగాపూర్‌ దత్తాత్రేయ ఆలయానికి వెళ్లి కారులో తిరిగి వస్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది.

ప్రాథమిక వివరాల ప్రకారం.. సంగారెడ్డి జిల్లాలోని నారాయణఖేఢ్ కు చెందిన ఐదుగురు వ్యక్తులు గానుగాపూర్ ఆలయానికి కారులో బయల్దేరారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా దత్తాత్రేయ ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆ తర్వాత తిరిగి ఇంటికి వస్తుండగా. ఇవాళ ఉదయం ...