భారతదేశం, డిసెంబర్ 25 -- కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. చిత్రదుర్గ్​ హిరియూర్​ సమీపంలోని బెంగళూరు- హుబ్బళ్లి హైవేపై ఒక స్లీపర్​ బస్సుకు మంటలు అంటుకున్నాయి. మరో వాహనాన్ని ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో 20మంది సజీవదహనం అయినట్టు తెలుస్తోంది. అనేక మంది గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

గురువారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం చోటుచేసుకుందని తెలుస్తోంది.

Published by HT Digital Content Services with permission from HT Telugu....