Hyderabad, ఆగస్టు 3 -- వైవిధ్యమైన కంటెంట్‌తో ఎప్పటికప్పుడు ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందిస్తున్న వన్ అండ్ ఓన్లీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్. వివిధ భాషల్లో డిఫరెంట్ కంటెంట్ అందించే సోనీ లివ్ ఓటీటీ నుంచి రానున్న లేటెస్ట్ సిరీస్ 'మయసభ : రైజ్ ఆఫ్ ది టైటాన్స్'.

ఇప్పటికే సెన్సేషన్‌గా మారిన మయసభ ఓటీటీ సిరీస్‌కు వెర్సటైల్ ఫిల్మ్ మేకర్ దేవ కట్టా, కిరణ్ జయ కుమార్ దర్శకత్వం వహించారు. హిట్ మ్యాన్ అండ్ ప్రూడోస్ ప్రొడక్షన్స్ ఎల్.ఎల్.పి బ్యానర్స్‌పై విజయ్ కృష్ణ లింగమనేని, శ్రీహర్ష ఈ సిరీస్‌ను రూపొందించారు.

ఇక 'మయసభ' టీజర్‌ను వదిలినప్పటి నుంచి ఈ సిరీస్ గురించి అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు. రీసెంట్‌గా మయసభ ట్రైలర్ కూడా మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అయితే, మయసభ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో సోనీ లివ్ ఓటీటీ బిజినెస్ హెడ్ ధనీష్ కాంజ...