భారతదేశం, అక్టోబర్ 30 -- మెుంథా తుపాను ఆంధ్రప్రదేశ్, తెలంగాణను అతలాకుతలం చేసింది. వాగులు, వంకల గుండా నీరు ప్రవహిస్తూనే ఉంది. పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతూనే ఉన్నాయి. ఈ రోజు కూడా పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుపాను తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకోవాలి.

తుపాను తర్వాత నీరు తాగేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎందుకంటే నీరు కలుషితమయ్యే అవకాశాలు ఎక్కువ. దీనితో చాలా రకాల రోగాలు వస్తాయి. అందుకే కేవలం వేడిచేసిన లేదా క్లోరినేటెడ్ నీరు మాత్రమే తాగాలి. తుపాను ప్రభావం తగ్గింది కదా అని బయట తిరగకండి. అధికారిక సమాచారం వచ్చేవరకు బయటకు వెళ్లవద్దు. ఎప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో చెప్పలేం.

మీరు పునరావాస కేంద్రంలో ఉంటే అధికారులు చెప్పేవరకు తిరిగి ఇంటికి వెళ్లవద్దు. చెప్పకుండా ఇంటికి వెళ్లి మళ్లీ ప్రమాదంలో పడకూడదు. విద్యుత్ ప్రమాదా...