భారతదేశం, నవంబర్ 4 -- ఒక రోడ్డు ప్రమాదం మరిచిపోకముందే మరో రోడ్డు ప్రమాదం జరుగుతోంది తెలుగు రాష్ట్రాల్లో. నిన్నటికి నిన్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ లారీ ఢీ కొట్టింది. 19 మందికిపైగా ప్రాణాలు గాల్లో కలిశాయి. ఇది మరవకముందే రోడ్డు ప్రమాదాల వార్తలు వస్తూనే ఉన్నాయి. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం రేణికుంట బ్రిడ్జి రాజీవ్ రహదారిపై ట్రాక్టర్‌ను ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీకొట్టింది. ట్రాక్టర్ వడ్ల లోడుతో వెళ్తోంది. ఆర్టీసీ బస్సు వెనక నుంచి ఢీ కొట్టింది.

ఈ ప్రమాదంలో ట్రాక్టర్‌ డ్రైవర్‌తోపాటుగా బస్సులో ఉన్న 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందడంతో పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. బస్సులోని ప్రయాణికులను బయటకు తీశారు. క్షతగాత్రులను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

ప్రమాదానికి కారణం ఆర్టీసీ డ్రైవర్ నిర్లక్ష్యమ...