Hyderabad, ఆగస్టు 8 -- స్వాతి ముత్తిన మాలే హానియే, టోబీ చిత్రాల అద్భుతమైన విజయం తర్వాత కన్నడ స్టార్ నటుడు రాజ్ బి శెట్టి మరోసారి ప్రేక్షకులను ఆకట్టుకోబోతోన్నారు. దర్శకుడు గురుదత్ గనిగ దర్శకత్వం వహించిన సినిమా 'కరవాలి'. కర్ణాటక తీరప్రాంత ప్రకృతి దృశ్యాలను కరవాలి అంటూ దర్శకుడు తెరపైకి తీసుకు రాబోతోన్నారు.

విజువల్ వండర్‌గా రాబోతోన్న ఈ 'కరవాలి' చిత్రంలో ప్రజ్వల్ దేవరాజ్ హీరోగా నటిస్తుండగా.. రాజ్ బి. శెట్టి మవీర అనే పాత్రలో కనిపించబోతోన్నారు. ఇప్పటికే 'కరవాలి' నుంచి వచ్చిన పోస్టర్, గ్లింప్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే.

ఇక ఇప్పుడు ఓ శక్తివంతమైన పాత్రలో రాజ్ బి శెట్టి కనిపిస్తుండటంతో ఈ ప్రాజెక్ట్ మీద మరింత హైప్ పెరిగినట్టు అయింది. ఈ మేరకు విడుదల చేసిన గ్లింప్స్‌‌లో కథను చెప్పీ చెప్పనట్టుగా చూపించారు. కానీ, రాజ్ బి శెట్టి మాత్రం ఓ సూపర...