భారతదేశం, డిసెంబర్ 22 -- కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యానికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కారణమని తెలంగాణ నీటిపారుదల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. ఆయన హయాంలో ప్రాజెక్టు కూలిపోవడం డిజైన్, అమలులో లోపాల వల్లే జరిగిందని ఆయన అన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టు గురించి మాట్లాడటం ఆపేసి సిగ్గుతో తలదించుకోవాలని విమర్శించారు.

'సిగ్గుతో తలలు వంచుకుని మేడిగడ్డ ప్రాజెక్టును సమర్థించడం మానేయాలి. కాళేశ్వరం ప్రాజెక్టుకు రూ.1.80 లక్షల కోట్ల భారీ వ్యయం అయింది. ఈ ప్రాజెక్టు నిరుపయోగం కావడం బీఆర్ఎస్ ఘనత. బీఆర్ఎస్ ప్రభుత్వం ఐదు సంవత్సరాలలో 70 నుండి 80 టీఎంసీ నీటిని మాత్రమే ఉపయోగించుకున్నారు.' అని ఉత్తమ్ కుమార్ అన్నారు.

గత ప్రభుత్వం ప్రజా సంక్షేమం కంటే వ్యక్తిగత లాభానికి ప్రాధాన్యత ఇచ్చిందని మంత్రి ఉత్తమ్ ఆరోపించారు, వారు కమీషన్ల కోసం కాళేశ్వరం నిర్మించారని వ్యా...