భారతదేశం, జూన్ 14 -- కమల్ హాసన్, మణిరత్నం కాంబినేషన్లో వచ్చిన లేటెస్ట్ మూవీ 'థగ్ లైఫ్'. థియేటర్లలో ఈ మూవీ తీవ్రంగా నిరాశపరుస్తోంది. అంచనాలను అందుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో త్వరలోనే ఈ సినిమా ఓటీటీ బాట పట్టబోతోందనే క్రేజీ బజ్ వినిపిస్తోంది. ఈ మేరకు ఓటీటీ ప్లాట్ ఫామ్, మేకర్స్ మధ్య చర్చలు సాగుతున్నట్లు సమాచారం. ఈ మూవీలో కమల్ హాసన్, సిలంబరసన్ టీఆర్, త్రిష, అభిరామి తదితరులు కీలక పాత్రలు పోషించారు.

థగ్ లైఫ్ మూవీ జూన్ 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజైంది. అయితే ఈ సినిమా థియేటర్లలో విడుదలకు ముందే ఓటీటీ, శాటిలైట్ రైట్స్ అమ్ముడుపోయాయి. డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీ సొంతం చేసుకుంది. ఇందుకోసం ఏకంగా రూ.149.7 కోట్లు ఖర్చు చేసింది. మరోవైపు శాటిలైట్ రైట్స్ ను విజయ్ టీవీ రూ.60 కోట్లకు కొనుగోలు చేసింది. దీంతో థగ్ లైఫ్ థియేట్రికల్ రిలీజ్ కు ముంద...