Hyderabad, జూన్ 21 -- నేటి కాలంలో కుటుంబ వ్య‌వ‌స్థ బ‌ల‌హీన ప‌డుతోంది. అందుకు కార‌ణం మ‌నుషుల మ‌ధ్య ఎమోష‌న్స్ లేక‌పోవ‌టమే.. భావోద్వేగాలే బంధాల‌ను క‌ల‌కాలం నిలుపుతాయి. రెండు వేర్వేరు కుటుంబాలు, నేప‌థ్యాల నుంచి వచ్చిన వ్య‌క్తులు క‌లిసి ప్ర‌యాణించాలంటే వారి మ‌ధ్య ఎమోష‌న్స్ ఇంకెంత బ‌లంగా ఉండాలో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు.

ఇలాంటి సునిశిత‌మైన అంశాన్ని హృద్యంగా తెర‌కెక్కిస్తున్నారు ద‌ర్శ‌కుడు తాతినేని స‌త్య‌. ఈయ‌న ద‌ర్శ‌క‌త్వంలో మెగా కోడలు, హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠి, మ‌ల‌యాళ న‌టుడు దేవ్ మోహన్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో తెరకెక్కుతున్న చిత్రం 'సతీ లీలావతి'.

ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చ‌ర్స్ బ్యానర్‌పై నాగ‌మోహ‌న్ సతీ లీలావతి చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు భీమిలీ కబడ్డీ జట్టు, ఎస్‌.ఎం.ఎస్‌ (శివ మ‌న‌సులో శృతి) ఫేమ్...