భారతదేశం, జూన్ 9 -- కమల్ హాసన్, సిలంబరసన్ టి.ఆర్, త్రిష కృష్ణన్ ప్రధాన పాత్రల్లో మణిరత్నం తెరకెక్కించిన థగ్ లైఫ్ చిత్రానికి షాకింగ్ కలెక్షన్లు వచ్చాయి. థియేటర్లలో ఈ మూవీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. జూన్ 5న రిలీజైన ఈ మూవీ వీకెండ్ కలెక్షన్లలో తేలిపోయింది. ఇండియాలో శనివారం రూ.7.75 కోట్ల నెట్ వసూళ్లు రాబట్టిన థగ్ లైఫ్.. ఆదివారం మాత్రం కేవలం రూ.5.24 కోట్లు మాత్రమే ఖాతాలో వేసుకుంది.

జూన్ 5న థియేటర్లకు వచ్చిన థగ్ లైఫ్ కు మిక్స్ డ్ రివ్యూలు వచ్చాయి. ఫస్ట్ డే కలెక్షన్లు ఫర్వాలేదనిపించినా.. తర్వాత వసూళ్లు పడిపోయాయి. ఈ చిత్రం విడుదలైన నాలుగు రోజుల్లో ఇండియాలో రూ.35.64 కోట్ల నెట్ కలెక్షన్లు వసూలు చేసిందని సక్నిల్క్ వెబ్ సైట్ తెలిపింది. థగ్ లైఫ్ గురువారం థియేటర్లలో విడుదలై తొలి రోజు ఇండియాలో రూ.15.5 కోట్ల నెట్ వసూలు చేసింది. శుక్రవారం ...