Hyderabad, మే 28 -- కమల్ హాసన్, త్రిష, శింబు, అభిరామిలాంటి వాళ్లు నటించిన థగ్ లైఫ్ మూవీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే రిలీజైన ట్రైలర్లో 70 ఏళ్ల కమల్ హాసన్.. తన కంటే వయసులో ఎంతో చిన్నదైన అభిరామితో ఘాటు లిప్ లాక్ సీన్ చేయడంపై విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై తాజాగా హిందుస్థాన్ టైమ్స్ ఇంటర్వ్యూలో అభిరామి మాట్లాడింది.

ఈ ముద్దు సీన్ పై అభిరామి స్పందించింది. "ఈ రోజుల్లో ప్రతిదీ వివాదమే అవుతోంది. దాని నుంచి తప్పించుకోలేం. ఆ సీన్ వెనుక మణి సర్ లాజిక్ ను నేను జడ్జ్ చేయడం లేదు. అతని లాజిక్ ఏదైనా.. దాంతో నేను ఏకీభవిస్తాను. కిస్సింగ్ సీన్ విషయానికి వస్తే కేవలం 3 సెకన్ల కిస్ అది. కేవలం అదే ట్రైలర్లో చూపించేసరికి దానిని అపార్థం చేసుకున్నారు.

సినిమాలో ఆ సీన్ చూస్తే.. అలా అనిపించదు. ఆ సీన్‌కు బాగా కుదిరింది. అనవసరంగ...